Zombie Reddy Poster talkఅ!, కల్కి వంటి సినిమాలతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన తన తదుపరి ప్రాజెక్టుగా టాలీవుడ్ యొక్క మొదటి జాంబీ చిత్రం, జాంబీ రెడ్డి అనే పేరుతో తీస్తున్నారు. ఈరోజు ఆ చిత్ర బృందం టైటిల్ లోగోతో సినిమా పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది.

జాంబీ రెడ్డి టైటిల్ యానిమేష‌న్‌లో.. ఆకాశంలో నిండు చంద్రుడు, కొండ‌మీదున్న గుడిని కెమెరా క్లోజ‌ప్‌లో చూపిస్తూ ఉండ‌గా, గ‌బ్బిలాలు కీచుమంటూ అరుస్తూ ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని కాస్తా వ‌యెలెంట్‌గా మార్చేశాయి. ఒక శ్మ‌శానంలోని స‌మాధి బ‌ద్ద‌లైపోయి, దాని స్థానంలో ఒక్క‌సారిగా భూమిలోంచి ఓ చేయి ‘జాంబీ రెడ్డి’ టైటిల్‌ను ప‌ట్టుకొని ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎండిపోయిన చెట్టు కొమ్మ‌మీద గుడ్ల‌గూబ దానినే చూస్తోంది. ఆ టైటిల్ బ్యాగ్రౌండ్‌లో చంద్రుడు ఎరుపురంగులోకి మారిపోయాడు.

అయితే, ఈ పోస్టర్‌పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో హాలీవుడ్ లో వచ్చిన ఆర్మీ ఆఫ్ ది డెడ్, ది డెడ్ డోంట్ డై, డే ఆఫ్ ది డెడ్ వంటి చిత్రాల పోస్టర్లను పోలీ ఉంది జాంబీ రెడ్డి పోస్టర్ డిజైన్. ఇది ఎలా ఉండగా… జాంబీ రెడ్డి షూటింగ్ దాదాపు పూర్తయింది. చిత్రంలోని ప్రధాన భాగం లాక్డౌన్ సమయంలో పూర్తి చెయ్యడం గమనార్హం.

నిజ జీవిత ఘ‌ట‌న‌లను ఆధారం చేసుకొని సినిమా తీస్తున్నామని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు ఎవరు అనేది చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. థియేట‌ర్లు తెరుచుకున్నాక తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాం అంటూ చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతుంది.