YV Subba Reddyవైఎస్సాఆర్ కాంగ్రెస్ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిన్న అమరావతిలో జరిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ఇంటి గృహప్రవేశానికి హాజరు కాలేదు. ఆయన కేవలం పార్టీ ఎంపీ మాత్రమే కాదు! జగన్‌కు స్వయానా చిన్నాన్న. (వైఎస్‌, వైవీ సుబ్బారెడ్డి తోడల్లుళ్లు) వైవీ సుబ్బారెడ్డి ఈ వేడుకకు గైర్హాజరు కావడం సరత్రా చర్చనీయాంశమైంది. గత కొంత కాలంగా ఆయన జగన్ పై అలక బూనారు. ఒంగోలు లోక్‌సభ టికెట్‌ను ఈ సారి ఆయనకు ఇవ్వడానికి జగన్ సుగుమంగా లేరని వార్తలు వస్తున్నాయి.

టీడీపీకి చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నానని జగన్‌ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన జగన్ మీద అలక బూనారు. ఆయనను అవసరమైతే పార్టీలోకి తీసుకుని వచ్చి జగన్ ను దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తుంది. వైవీ సుబ్బారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఆయన జగన్ ను కలిసి ఒంగోలు సీటు గురించి మాట్లాడారట. అయితే జగన్ మాత్రం సీటు ఇచ్చేది లేదు అని ఖరాకండిగా చెప్పేశారట జగన్. దీనితో ఆయన బాగా నోచుకున్నారు.

2014లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా వైవీ సుబ్బారెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ తరఫున పోటీచేసిన మాగుంటపై విజయం సాధించారు. కాంగ్రెస్ నుండి వచ్చిన మాగుంట టీడీపీలో ఇమడలేకపోతున్నారు. ఆయన పార్టీని వీడటం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. మరో సీనియర్ ఎంపీ నెల్లూరు కు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా జగన్ పట్ల సంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఆయనకు కూడా సీటు ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీనియర్ నేతలు గనుక పార్టీ నుండి తప్పుకుంటే అది జగన్ కు ఇబ్బందే.