YV-Subba-Reddy comments on Polavaram Projectఆంధ్రప్రదేశ్ కు ఆయువుపట్టుగా చెప్పబడుతున్న పోలవరం పైనే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దీనిని వీలైనంత తొందర్లో పూర్తి చెయ్యాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు సాగుతున్నారు. కేంద్రం సహరించకపోవడంతో ఆయన తిప్పలేదో ఆయన పడుతున్నాడు. మోడీని అనలేక దానిని చంద్రబాబు మీదకు నెట్టి విమర్శలు చేస్తుంది వైకాపా.

అయితే విమర్శించే విషయంలో కూడా ఆ పార్టీకి క్లారిటీ లేనట్టుంది. మొన్నటిదాకా పోలవరం కాంట్రాక్టర్ కంపెనీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుది కావడంవల్ల ఆ కంపెనీ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి వారి అంటకాగుతున్నారని చంద్రబాబుని విమర్శించేవారు ఆ పార్టీ వారు. అయితే ట్రాంస్ట్రాయ్ వల్ల ప్రాజెక్టు పూర్తి కాదు అని తేలడంతో కొన్ని పనులు వేరే కాంట్రాక్టర్ కు ఇవ్వాలని చూస్తుంది ప్రభుత్వం.

దీనికోసం కేంద్రంతో పెద్ద యుద్ధమే చేసారు చంద్రబాబు. కాంట్రాక్టరు మారబోతుండటంతో వైకాపా కొత్త పల్లవి అందుకుంది. కమీషన్ల కోసమే ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బాబు తరచుగా మారుస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

అసలు కాంట్రాక్టరును మార్చాలని ఆ పార్టీ అంటుందా? లేక మార్చకూడదు అని వాదిస్తుందా? వేరువేరు సమయాల్లో ఆ పార్టీ చేసిన రెండు వేరు విమర్శలలో ఏది నిజం? లేకపోతే అసలు దేనిలోనూ నిజం లేదా? ఊరకనే ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి, విమర్శలు చెయ్యాలి కాబట్టి చేస్తున్నారా?