YUganiki Okkadu -Aayirathil Oruvan Sequel తెలుగు సినిమాలకు తమిళ సినిమాలకు మోస్తరు తేడా ఉంటుంది. తమిళ సినిమాలు కధను పట్టుకుని వేలాడుతూ మెరుపులు మెరిపిస్తే, తెలుగు సినిమాలు మాత్రం కధ ను ఆధారంగా చేసుకుని కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి, దాన్ని పీక్స్ కి తీసుకు వెళ్ళి ఒక ఊపు ఊపి ఒదిలిపెడతాయి. అయితే కధను ఆనుకుని సినిమా ముందుకు ‘సాగి’తే అదేదో బలవంతంగా మనకు సినిమా చూస్తున్నట్లుగా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు గుర్తు ఉందో లేదో మన సూర్య తమ్ముడు కార్తీ హీరోగా ‘యుగానికి ఒక్కడి’ సినిమా వచ్చింది అప్పట్లో. పెద్దగా టెక్నాలజీ నిద్ర లేవని టైమ్ లోనే భలే తీశాడు దర్శకుడు సెల్వ రాఘవన్ ఆ సినిమా.

అయితే కాస్త డిఫరెంట్ సినిమా కావడం, కధతో కూడిన మెలిక ఉండడం, అదో రకమైన ప్రపంచంలోకి తీసుకు వెళ్ళడం ఇవన్నీ తమిళ తంబీలకు తెగ నచ్చేశాయి. ఇక మన తెలుగు వారికి కూడా పర్వాలేదు అనిపించింది అనుకోండీ. ఇప్పుడు దానికే సీక్వెల్ తీస్తాను అంటున్నాడు సదరు దర్శకుడు. అయితే ఈయన ఇప్పటివరకూ ఎక్కువగా లవ్ క్ల్యాసిక్స్ తియ్యడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అందులో ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, 7/ జీ బృంధావన్ కాలనీ ఇలాంటి లవ్ మూవీస్ ఉన్నాయి. ఇక తాను ఎక్కడికి వెళ్ళినా, తాను ధనుష్ తో తెరకెక్కించిన పుదుపేట్టై సినిమాకు సీక్వెల్ తియ్యండి అంటున్నారు అని, కానీ తనకు మాత్రం మనసులో వేరే సినిమా నడుస్తుంది అని, ఆ సినిమానె ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ అని, దాన్నే తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్-2’ గా తెలిపాడు సెల్వ రాఘవన్.

ఇక ఈ సినిమాలో చోళుల ప్రయాన్నాన్ని క్లుప్తంగా తెరపైన ఆవిష్కరించాలి అన్నది సెల్వ ఆలోచనగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మొత్తంగా చూసుకుంటే అప్పుడంటే పెద్దగా టెక్నాలజీ లేదు, పైగా కార్తి పెద్ద హీరో కాదు, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ లో కార్తి నటిస్తే మాత్రం, ఇప్పుడున్న టెక్నాలజీ తో, కార్తికి ఉన్న ఫేమ్ తో సెల్వ వండర్స్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.