Yuddham Sharanam Premier Show Talk‘దోచేయ్’ వంటి పరాజయం తర్వాత ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి యావరేజ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన అక్కినేని నాగచైతన్య, ఈ ఏడాది “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే ఊపులో నేడు “యుద్ధం శరణం” సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైన ఈ సినిమా టాక్ ఎలా ఉంది? ముందుగా ప్రదర్శితమైన యుఎస్ ప్రీమియర్ షో నుండి ఆశాజనకమైన టాక్ రాకపోవడం గమనించదగ్గ విషయం.

అర్జున్ అనే ఓ యువకుడు కుటుంబాన్ని నాయక్ విలన్ గ్యాంగ్ ఎలా చంపింది? దానికి అర్జున్ తీర్చుకున్న రివేంజ్ ఏంటి? అన్నదే క్లుప్తంగా చిత్ర కధ. ఫస్టాఫ్ సరదాగా, సింపుల్ గా సాగిపోయిన కధ కాస్త సెకండాఫ్ కు వచ్చేపాటికి సీరియస్ గా వెళుతుంది. ‘ఓకే’ అనిపించిన ఫస్టాఫ్ టాక్ ను సెకండాఫ్ నిలబెట్టుకోలేకపోవడం ప్రధాన మైనస్ పాయింట్. వినోదానికి ఎక్కడా తావు లేకుండా ఉండడం, రొటీన్ సినిమాటిక్ క్లైమాక్స్ ఇవ్వడం అనేది, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు అంతగా రుచించని అంశంగా మారింది.

ఇలాంటి తరహా పాత్రలు ఇంతకుముందు నాగచైతన్య చేసినవే అయినప్పటికీ, ఏమోషన్స్ ను పండించడంలో మరింతగా ప్రతిభ కనపరిచాడు. హీరోయిన్ లావణ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేం లేదు గానీ, ఈ సినిమాలో గ్లామరస్ గానే కనిపించింది. విలన్ గా కెరీర్ ఆరంభించి, సక్సెస్ ఫుల్ హీరోగా మారిన శ్రీకాంత్ విలనిజం ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్ లలో ఒకటి. యుఎస్ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనానికి పెద్ద పీట వేస్తారన్న విషయం తెలిసిందే. దీంతో రొటీన్ రివేంజ్ గా తెరకెక్కిన “యుద్ధం శరణం”కు డివైడ్ టాక్ లభించింది.