YSRCP YS Jagan Victory in Andhra Pradesh Elections 2019ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకూడా అనుకోనంతగా ఆ పార్టీ 150 పైచిలుకు సీట్లలో గెలుపు వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టుమని పాతిక సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉంది. జగన్ వేవ్ లో తెలుగుదేశం పార్టీ టీడీపీ కంచుకోటలు కూడా కొట్టుకుపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ కూడా దారుణమైన ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు.

చాలా మంది మంత్రులు కూడా ఓటమి చవిచూస్తున్నారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, భూమా అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పి.నారాయణ, కిమిడి కళావెంకటరావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, శ్రావణ్ కుమార్ వంటి మంత్రులు ఓటమి వైపు అడుగులు వేస్తున్నారు. పరిటాల శ్రీరామ్, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్ర కూడా గడ్డు పరిస్థితి ఎదురుకోవడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.

ఇంకొక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు కూడా కుప్పం నుండి ఒకటి రెండు రౌండ్లలో వెనుకబడటం. గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ అంత కూడా చంద్రబాబు కూడా ఈ సారి రాకపోయే పరిస్థితి ఉండటం ఆ పార్టీ నేతలకు జీర్ణం కావడం లేదు. వచ్చే ఐదేళ్ళలో ప్రతిపక్షంలో టీడీపీ మనగలగడం కూడా ఇబ్బందే. పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ 24-25 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. టీడీపీకి అసలు ఎంపీ సీటు రాకపోతే అది జాతీయ స్థాయిలో ఇబ్బందే. రామ్ మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, అశోక్ గజపతి రాజు కూడా ఓటమి వైపు నడుస్తున్నారు.