No-Pawan-Kalyan,-It-is-Not-A-Decision-To-Be-Proud-Ofఓటమి నుండి తేరుకుని జనసేన పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. జనసేనపార్టీ కమిటీలను పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పొలిట్‌ బ్యూరో , రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నిన్న ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో పార్టీ వాణి సమర్ధవంతంగా వినిపించారని పార్టీ అధినాయకత్వం మెచ్చుకుందట.

ప్రజాసమస్యలపై జనసేన గళం గట్టిగా వినిపించారని, మునుముందు కూడా అది కొనసాగించాలని రాపాకను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోరిందట. ఇదంతా బానే ఉంది కానీ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను మించి ముఖ్యమంత్రి స్తుతి చెయ్యడంపై పవన్ కళ్యాణ్ వైఖరి ఏమిటో. జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారని చెప్పారు. అలాంటి బడ్జెట్‌నే సీఎం జగన్‌ రూపొందించారని కితాబిచ్చారు.

పారదర్శకతతో బడ్జెట్‌ను తయారు చేశారని.. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలున్నాయని ప్రశంసించారు. అక్కడితో ఆగిపోతే పర్లేదు…. ఒకానొక సందర్భంలో కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని మత్య్సకారులు చెబుతున్నారని రాపాక అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. మరి దీనిపై జనసేన పార్టీ స్టాండ్ ఏంటో? పార్టీ మాటలే జనసేన ఎమ్మెల్యే నోటి నుండి వచ్చాయా? రాపాకను రాజకీయ వ్యవహారాల కమిటీ మెచ్చుకోవడం జనసైనికులు మరింత అయోమయానికి గురి చేసింది.