Jagan's 75% Jobs Rule to Backfire on AP Youth?వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్కీంలు మొదలు పెట్టడానికి మీనమేషాలు లెక్కపెడుతూ ఇంకో పక్క పాత స్కీంలకు పేర్లు మారుస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి పేరు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును పలుస్కీములకు పెడుతున్నారు. ఎన్టీఆర్ భరోసాగా ఉన్న పెన్షన్ స్కీం ను ఇప్పటికే వైఎస్సార్ పెన్షన్ స్కీంగా మార్చారు. తాజాగా మరికొన్ని స్కీంల పేర్లు మార్చారు. చంద్రన్న పెళ్లి కానుకగా ఉన్న పథకానికి వైఎస్సాఆర్ పెళ్లి కానుకగా మార్చారు.

గతంలో ఎవరి పేరు మీదా లేని మధ్యాహ్న భోజన పథకానికి కూడా వైఎస్ పేరు పెట్టడం విశేషం. ఈ పథకానికి వైఎస్ అక్షయపాత్రగా పేరు మార్చారు. ఇదివరలో ‘పెన్షన్ స్కీం మార్చేటప్పుడు గతంలో అది వైఎస్ పేరు మీద ఉండేది కాబట్టే మార్చాము అని చెప్పుకొచ్చారు ఇప్పుడు పెళ్లి కనుక అనేది వైఎస్ జమానాలో లేనే లేదు. ఇక మధ్యాహ్న భోజన పథకం ఎప్పటినుండో ఉన్న పథకమే అయినా ఏ ప్రభుత్వానికి దానికి తమ పేరు పెట్టుకోవాలని ఎందుకో అనిపించలేదు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఆ ఆలోచన కలగడం విశేషం.

ఇది ఇలా ఉండగా కొన్ని పథకాలలో లబ్దిదారులకు వచ్చే ప్రయోజనాల మీద పాత ప్రభుత్వం పేర్లు ఉంటే వాటికి కొత్త పేర్లతో కవర్లు, స్టికర్లు ఏర్పాటు చేసుకోవడం విశేషం. రాజకీయపార్టీలకు ఈ అభద్రతాభావం ఏంటో? 151 సీట్లతో గెలిపించాకా కూడా మిగిలిపోయిన వస్తువుల మీద చంద్రబాబు పేరు ఉంటే ప్రజల మనసు మారిపోతుందా? అది సరే…. ఈ మధ్య ఆపేసిన అన్న కాంటీన్లు కూడా ఏదో ఒక పేరుతో మళ్ళీ మొదలు పెడితే అదే పదివేలు అనుకుంటున్నారు వాటి మీద ఆధారపడి పొట్ట నింపుకునే నిరుపేదలు.