YSRCP u turn on BJP allaianceబీజేపీతో పొత్తుకు రెడీ అంటూ నేషనల్ మీడియా ముందు ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు జగన్. స్పెషల్ స్టేటస్ ఇస్తే కలిసి పోటీ చెయ్యడానికి అభ్యంతరం లేదు అని డిక్లేర్ చేసారు. అయితే ఇప్పుడు మైనారిటీ ఓట్లు పోతాయి అని గ్రహించినట్టున్నారో ఏమో ఆ విషయంపై ఆ పార్టీ యూ టర్న్ తీసుకుంది.

ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి, కలిసి పోటీచేయడానికి తేడా ఉందని రాజ్యసభ సభ్యుడు జగన్ ఆంతరంగికుడైన విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే వైసీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన మీడియాతో అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని మాత్రమే తమ పార్టీ అధినేత జగన్‌ పేర్కొన్నారని చెప్పారు. టీడీపీ తమపై బురద చల్లే యత్నం చేస్తుందని ఆయన అన్నారు. బిజెపితో కలిసి ఉన్నవాళ్లు తమపై ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

గడిచిన 48 గంటల్లో ఏం మార్పు వచ్చిందని వైకాపా తన నిర్ణయం మార్చుకుందో మరి? అనాలోచితంగా జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడేశారా? లేక ఎందుకన్న మంచిదని విజయ సాయి రెడ్డితో వేరేగా మాట్లాడిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీ నిశితంగా పరిశీలిస్తుంది.