YSRCP tops in election surveyవైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతల హడావిడి వేరుగా ఉంటుంది. ఒకపక్క జాతీయ మీడియా సర్వేలలో తమ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయని సంబరాలు చేసుకుంటారు. ఆ విషయాన్నీ తమ ఆస్థాన పత్రికైనా సాక్షిలో బ్యానర్ ఐటెం గా వేసుకుంటారు. అయితే సర్వే అంటూ నియోజకవర్గాలలో ఎవరైనా కనిపిస్తే మాత్రం వారికి ఎక్కడ లేని భయం. తమ పార్టీ వారి ఓట్లు తొలగించేస్తున్నారని అపోహలు. ఎన్నికల సంఘం తమ అనుమతి లేకుండా ప్రైవేట్ వారు ఓట్లు తొలగించలేరని పలు మార్లు చెప్పినా వినరు.

పైగా సర్వేలు అంటూ గ్రామాలలో తిరుగుతున్న వారిని పట్టుకుని కొడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడంలేదని, పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తారు. అసలు సర్వేలు చెయ్యకపోతే వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పరిస్థితిలు ఉన్నా ఆ విషయం ఎలా చెప్పగలరు ఎవరైనా? ఢిల్లీలో కూర్చుని నోటి లెక్కలు వేసేసి అవే సర్వేలు అంటూ వేసేయ్యడమే నిజమైన సర్వేలా?

అటువంటి సర్వేలలో మాత్రమే తమకు అనుకూలమైన పరిస్థితి ఉంటుందని ఏమైనా భావిస్తున్నారా? ఆ పార్టీ నాయకుల పోకడ చూస్తే అటువంటి అనుమానాలు రాక మానవు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలైన అంశాల మీద దృష్టి పెట్టకుండా ఇటువంటి అనవసరమైన విషయాలు పట్టించుకుంటే ఆ పార్టీకి మొదటికే మోసం జరగొచ్చు. మరోవైపు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ చేరుకోబోతున్నారు.