YSRCP support to yatra movieదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి వైఎస్సాఆర్ పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాన్య ప్రేక్షకులకు కొంత బోర్ అనిపించినా ఈ సినిమా వైఎస్సాఆర్ అభిమానులకు మాత్రం అమితంగా నచ్చే సినిమా అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడుతున్నారు.

పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సాఆర్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సాఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదలైన అన్ని చోట్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు వెన్నుదన్నుగా నిలిచారు. సినిమా బెనిఫిట్ షోలకు పెద్దగా డిమాండ్ లేకపోయినా చాలా చోట్ల నాయకులు బెనిఫిట్ షోలను భారీ మొత్తాలకు కొన్ని టిక్కెట్లను తమ పార్టీ క్యాడర్ కు ఉచ్చితంగా పంచారు.

అమెరికాలో కూడా ఇదే పోకడ కనిపించడం విశేషం. వైఎస్సాఆర్ కాంగ్రెస్ ను సమర్ధించే ఒక తెలుగు అసోసియేషన్ ఈ చిత్రానికి భారీగా పబ్లిసిటీ చేసిందట. అక్కడ వైఎస్సాఆర్ పార్టీ వీర విధేయుడిగా ఉండే ఒక కోటీశ్వరుడు చాలా చోట్ల సినిమా ప్రీమియర్ టిక్కెట్లను బల్క్ లో కొనుగోలు చేసి ఉచ్చితంగా పంచారట. ఎన్నికల వేళ ఈ సినిమాను ప్రెస్టేజ్ గా తీసుకోవడమే దీనికి కారణం. సినిమా వసూళ్లు ఎక్కువగా ఉంటే ప్రజలలో వైఎస్ చిరస్థాయిగా ఉన్నారు అనే భావన ప్రజలలోకి వెళ్తుందని అభిమానుల భావన. ఇది ఎన్నికలలో ఉపకరిస్తుందని వారి అభిప్రాయం కూడా.