ysrcp social media missleads dachepally issue on kamma casteగత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లోని హాస్టళ్లు, పీజీలు మూసెయ్యడంతో వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారికి తెలంగాణ పోలీసులు ఎన్ఓసిలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు పంపింది. అయితే ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్టుల వద్ద వారిని ఆపేసింది అక్కడ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేవారు 14 రోజుల పాటు ప్రభుత్వం ఆధీనంలో ఐసోలేషన్ లో ఉంటేనే అనుమతి ఇస్తామని షరతు పెట్టింది. దీనికి వారు అంగీకరించలేదు. దీనితో వారు దాదాపుగా ఒక రోజు పాటు అక్కడే నిలిచిపోయారు. చాలా గంటల నిరీక్షణ తరువాత గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద కొందరు పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు.

ఇది ఇలా ఉండగా… ప్రభుత్వం మీద విమర్శలు వస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని హాస్టళ్లు చాలా వరకు కమ్మ సామాజిక వర్గం వారివే అని, వాటి యజమానులతో మీటింగులు పెట్టి చంద్రబాబు, లోకేష్ వారితో హాస్టళ్లు మూయించేశారని, కావాలనే ఈ ఉపద్రవం సృష్టించారని ఆరోపిస్తున్నారు.

విపత్తు సమయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా నీచ రాజకీయం అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చేతకానితనాన్ని తమకు ఆపాదిస్తున్నారని అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా హై కోర్టు ఈరోజు అక్కడ ఉండిపోయిన వారికి పరీక్షలు జరిపి ఆరోగ్యం బావున్న వారిని ఇళ్లలో, ఏవైనా ఆరోగ్య సంబంధ ఇబ్బందులు ఉన్న వారిని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లకు తరలించారని ప్రభుత్వాన్ని ఆదేశించింది.