ysrcp-roja-speaker-or-minister-andhra-pradeshవైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ రోజా అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ నగరి నుండి మరోసారి గెలిచారు. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ వాణి అసెంబ్లీ లో గట్టిగా వినిపించిన రోజా ఒక సమయంలో హద్దు దాటి తన క్రమశిక్షణా రాహిత్యంతో శాసనసభలో ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. రోజా నోటి దురుసు వల్ల టీడీపీ నాయకులు గానీ, అభిమానులను గానీ ఆమెను బద్ద శత్రువులానే చూస్తారు. దీనితో ఈ సారి ఎలాగైనా ఆమెను ఓడించాలని ఎంత గట్టినా ప్రయత్నించినా ఆమె గెలిచారు.

అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిపదవి మీద ఆశలు పెట్టుకున్నారు రోజా. అయితే ఆమె భవితవ్యం పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమెను జగన్ స్పీకర్ ను చెయ్యబోతున్నారని, గతంలో ఏ సభలో అయితే ఆమెను తెలుగుదేశం వారు అవమానించారో అదే సభలో ఆమెను మేడం స్పీకర్ అని పిలిపించే ప్రయత్నం అయ్యి ఉండవచ్చు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో స్పీకర్ గా పని చేసిన వారు వచ్చే ఎన్నికలలో ఓడిపోయే సంస్కృతి ఉండటంతో ఆ పదవి మీద రోజాకు ఎంత మాత్రం ఆసక్తి లేదట.

ఇంకో వాదన ప్రకారం రోజాకు మంత్రి పదవి అయితే సాధ్యం కాదని తెలుస్తుంది. చిత్తూరుజిల్లా నుంచి మంత్రిపదవిని ఆశిస్తున్న వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. అంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఆవిడకు ఇబ్బందిగా మారొచ్చు. జిల్లాలో పార్టీకి ఎప్పటినుంచో పెద్దదిక్కుగా ఉన్న పెద్దిరెడ్డికి పదవి ఇవ్వక తప్పదు. మహిళా కోట వేరే జిల్లాలలో పూర్తి కావడంతో ఈ దఫా రోజాకు పదవి ధక్కనట్టే అని సమాచారం. అయితే రోజా చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.