Daggubati -Purandeswari -BJPసీనియర్‌ రాజకీయ నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్‌ చెంచురామ్‌ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు పురందేశ్వరి బీజేపీలో కొనసాగడంపై అభ్యంతరం చెప్పని జగన్ ఆ తరువాతి కాలంలో ఆ దిశగా ఒత్తిడి చెయ్యడం, దగ్గుబాటిని పక్కన పెట్టే ప్రయత్నంతో ఈ నిర్మాణం తీసుకున్నట్టు సమాచారం.

గత ఎన్నికలలో తన ఓటమికి పని చేసిన రామనాథం బాబును పార్టీలోకి తీసుకోవాడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారట. దీనిపై మొట్టమొదటి సారి గా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పురందేశ్వరి స్పందించారు. అయితే ఆవిడ ఈ విషయంగా డైరెక్టుగా స్పందించకుండా నర్మగర్భంగా వ్యాఖ్యలు చెయ్యడం విశేషం.

“ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు నాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు. ఆ పార్టీలో చేరడానికి ముందు నా భర్త .. నేను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారు. అందుకు వారు అంగీకరించిన తరువాతే నా భర్త, నా కుమారుడు ఆ పార్టీలో చేరారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని వెంకటేశ్వరరావును అడగండి” అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి రాజకీయాల నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు విరమించుకుంటారని వార్తలు వస్తున్నా, కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆయన బీజేపీలో చేరవచ్చని కూడా నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్న కారణంగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసే అవకాశం లేదంటున్నారు.