Will ys jagan get the victory in 2019 electionsఅసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. విరాళాల సేకరణలో వైకాపా దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో మూడో స్థానంలో ఉంది. 2017-18లో ఆ పార్టీకి రూ.8.35 కోట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెరాస, టీడీపీల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ ముందు ఉండటం విశేషం. 3.30 కోట్లతో తెరాస ఐదో స్థానంలో, 1.73 కోట్లతో తెలుగుదేశం పార్టీ ఏడో స్థానంలో ఉన్నాయి.

ముందు సంవత్సరం వచ్చిన నిధులతో పోల్చి చూసినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరాళాల్లో 95 శాతం పెరుగుదల (దేశంలో మెదటి స్థానం), తెలంగాణ రాష్ట్ర సమితి విరాళాల్లో 90శాతం పెరుగుదల (దేశంలో మూడో స్థానం) కనిపించింది. అత్యధిక విరాళాలు పొందిన మొదటి రెండు ప్రాంతీయ పార్టీల జాబితాలో బిజూ జనతాదళ్‌ 13.04 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, జేడీ(యూ) 11.19 కోట్లతో రెండో స్థానంలో (87 శాతం పెరుగుదల) నిలిచాయి.

ప్రతి పార్టీ రూ.20వేల కన్నా ఎక్కువగా వచ్చిన విరాళాలపై ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలి. దీనికి వంద శాతం ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఏటా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన నివేదికల ఆధారంగా తయారు చేసిన జాబితా ఇది. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు లెక్కలలో చూపించకుండా నిధులు సేకరించే విషయం అందరికీ తెలిసిందే. ఆ లెక్క 100 కోట్లలో ఉంటాయనే విషయం లోకవిదితమే.