Vijayasai Reddy supports his party leadersతెలుగుదేశం పార్టీలోని బడా నాయకులని టార్గెట్ చేసి ఆ పార్టీని బలహీనపరచడం ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇప్పటికే ఆ ప్రయత్నాలలో భాగంగా మాజీ మంత్రులు… అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను జైలు పాలు చేశారు. తాజాగా ఆ పార్టీ గంటా శ్రీనివాసరావుని టార్గెట్ చేసినట్టుగా సమాచారం.

గంటా శ్రీనివాసరావును ఉద్దేశిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకిళ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.12 కోట్ల కొనుగోళ్లలో రూ.5కోట్ల అవినీతి జరిగిందన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్నే చెబుతూ.. తుప్పు సైకిళ్ళపై గంటా శీను ఘనఘనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి జరిగింది.. ఎస్‌కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువెత్తాయని ఆరోపించారు. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ గంటానే అంటూ రాజకీయ వర్గాలలో చర్చజరుగుతుంది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ లోగా వీలైనంత మంది నాయకులను జైలుకు పంపడమో లేక, తమ పార్టీలో చేర్చుకోవడమో చేస్తే టీడీపీ పని అయిపోతుందని అధికార పార్టీ వ్యూహం అని విశ్లేషకులు అంటున్నారు. “కేసులు పెడితే ఆ బురద కడుక్కోవడమే సరిపోతుంది. పార్టీ మారితే గొడవే లేదు. ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ నీచ ఆలోచన,” అంటూ టీడీపీ వారి ఆరోపణ.