Margani Bharatఓ పక్కనేమో మన గౌరవ ముఖ్యమంత్రి గారేమో వివిధ స్కీంల రూపేణా డబ్బులిస్తున్నారు. ఈ డబ్బంతా కూడా ఇలా రొటేషన్ అయ్యి, సినిమా వాళ్ళ దగ్గరికి కొంత అమౌంట్ వెళ్తోంది – ఇది వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్టేట్మెంట్.

ఈ ప్రకటన ద్వారా భరత్ అసలేం చెప్పదలుచుకున్నారో ఆయనకైనా తెలుసో లేదో గానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడిగా మార్గాని భరత్ కు రాష్ట్రంలో అమలు చేస్తోన్న స్కీంలపై ఉన్న పట్టు.

అంటే ఏపీ సర్కార్ అమలు చేస్తోన్న స్కీంలలో స్కాంలు జరుగుతున్నాయని పరోక్షంగా చెప్తున్నారా? ముఖ్యమంత్రిగా జగన్ ఎంతో కష్టపడి పంచుతోన్న డబ్బులు లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పడుతున్నాయా? అన్న ప్రశ్నలకు తావిచ్చే విధంగా భరత్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.

రొటేషన్ పద్ధతిలో జగన్ పంచిన డబ్బులు సినిమా వాళ్లకు అసలు ఎలా వెళ్తున్నాయో కూడా సదరు ఎంపీ వివరణ ఇస్తే బహు మేలుగా ఉండేది. ఏదో సినీ ఇండస్ట్రీని కార్నర్ చేయాలని చేసిన ప్రయత్నంలో సొంత పార్టీనే ఇరుకునే పెట్టే విధంగా భరత్ చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.

సీఎం పంచుతోన్న డబ్బులు, సరైన వాటికి వినియోగించుకోకుండా ప్రజలు సినిమాలు చూడడానికి ఖర్చు చేసేస్తున్నారని భరత్ భావిస్తున్నారా? ఏమో ఈ విజ్ఞానపు వ్యాఖ్యల వెనుక ఉన్న పరిజ్ఞానం అర్ధం చేసుకునే సామర్ధ్యత సామాన్యులకు కష్టం గానీ, సదరు వైసీపీ ఎంపీనే వివరణ ఇవ్వాలి.