How many will remain with Jagan?సోమవారం ఢిల్లీ ప్రయాణాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు తమ జీవితంలో మరిచిపోలేనంత అనుభూతులను మిగిల్చింది. ఏకంగా 44 మంది ఎమ్మెల్యేలు, మరికొంత మంది ఎమ్మెల్సీలు… అంటే మొత్తం పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఎక్కిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో… కొద్దిక్షణాల పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉదంతం గుర్తు చేసుకున్న వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టినట్లయ్యింది.

సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ తీసుకున్న మరుక్షణమే, తిరిగి శంషాబాదు ఎయిర్ పోర్టులోనే దించేస్తున్నామని ప్రకటించిన మహిళా పైలట్ల స్వరానికి, అప్పటిదాకా నవ్వుతూ, తుళ్లుతూ కనిపించిన రోజా సహా మిగిలిన వైసీపీ నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి కుర్చీలకే అతుక్కుపోయారు. ఏ ఒక్కరి నోటా మాటా లేదు, తమకు ఎలాంటి అపాయం కలగకుండా చూడాలని వారంతా దేవుడిని మనసులోనే ప్రార్థించారట. ఈ లోగానే మహిళా పైలట్లు విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని…. ‘బతుకు జీవుడా…’ అంటూ బయటపడ్డారు.

అయితే టేకాఫ్ కు ముందు పరిస్థితి గమనిస్తే… వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సీట్ల వరుసల మధ్య నిల్చుని చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో అదే రోజాతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా భయంతో వణికిపోయారు. రోజా సెల్ఫీ తీసుకున్న ఫొటోలు మీడియాలలో హైలైట్ అయ్యాయి.