YSRCP MLA Vundavall Sridevi fires on TDPతాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో.. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు జేసీ దినేశ్ కుమార్ తో కూడిన బృందం చేపడుతున్న విచారణకు ఆమె హాజరయ్యారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై విమర్శలు సంధించారు.

కుల ధ్రువపత్రాలన్నీ జేసీ దినేశ్ కుమార్ కు అందించాను. నాకు, నా కుటుంబ సభ్యులకు హిందూ మాదిగ కుల ధ్రువపత్రాలున్నాయి. కేవలం నేను టీడీపీ పై వారి మీద పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు పెడతాను,” అని ఆవిడ హెచ్చరించారు.

అయితే శ్రీదేవి వ్యాఖ్యలు కొంత సత్యదూరంగా ఉన్నాయని అంటున్నారు. “శ్రీదేవి మాదిగ కులంలోనే పుట్టారు. అయితే ఆమె మతం మార్చుకోవడం వల్ల ఎస్సీ కేటగిరీలోకి రారు,” అంటూ నిపుణులు అంటున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో శ్రీదేవి తాను క్రిస్టియన్ మతస్థురాలినని చెప్పడంతోనే ఈ విషయం తెర మీదకు వచ్చింది.

భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తి, హిందూ మతం నుండి మారితే అతను లేక ఆమె ఎస్సీ గా పరిగణింపబడరు. తద్వారా వచ్చిన రిజర్వేషన్లు కోల్పోతారు. కారణం కేవలం హిందూ మతంలోనే కులం, వర్ణం అనేవి ఉంటాయి.