Telugu

అంతా టెన్షన్… టెన్షన్… రోజా గ‌న్‌మెన్ కు కరోనా

Share

మొన్న ఆ మధ్య తన నియోజకవర్గంలో అంబులెన్సు ని నడిపి వార్తలలోకి ఎక్కారు వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా. కొందరు అది హీరోయిజం అనగా మరి కొందరు మాత్రం అతి అన్నారు. అది అలా ఉండగా… ఇప్పుడు రోజా గ‌న్‌మెన్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న్ను తిరుప‌తిలో క‌రోనా ఆస్ప‌త్రికి త‌ర‌లించి… చికిత్స అందిస్తున్నారు.

అయితే రోజా గ‌న్‌మెన్‌కు వైర‌స్ సోకిన విష‌యం తెలియ‌డంతో.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో క‌ల‌వ‌రం రేపుతోంది. ఇటీవ‌ల న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన రోజా.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కొన్నిసార్లు ఆమె మాస్క్ కూడా ధ‌రించ‌లేదు. దీంతో ఆమె ప‌రిస్థితిపై కార్య‌క‌ర్తలు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

అయితే రోజా వర్గీయులు మాత్రం సదరు గన్‌మెన్ చాలా రోజులుగా సెలవులో ఉన్నాడని… ఆమె ఆరోగ్యంపై ఎవ‌రూ ఆందోళన చెందొద్ద‌ని అంటున్నారు. ఇటీవలే కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్ర‌తినిధులు, వారి స‌న్నిహితుల్లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా వారి భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ అరడజన్ కు పైగా ఎమ్మెల్యేలు కరోనా భారీన పడ్డారు. ఇది ఇలా ఉండగా… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 1608 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 సాంపిల్స్‌ను ప‌రిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో న‌మోద‌వ్వ‌గా, మిగ‌తా 32 క‌రోనా కేసులు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చినవారివి ఉన్నాయి. దీంతో ఏపీలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది.