YSRCP MLA Kurasala Kannababu comments on Nara Lokeshమాజీ మంత్రి లోకేష్ కనీస పరిజ్ఞానం లేకుండా పిచ్చి ట్వీట్ లు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అన్నారు. ఉల్లి ధరలు పెరిగితే జగన్ ప్రభుత్వం కారణం అని ట్వీట్ చేశారని, దీనిని బట్టి ఆయనకు కనీస విజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అర్దం అవుతుందని ఆయన అన్నారు.

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయని, కాని అదే సమయంలో ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఏమి చేస్తున్నాయి..జగన్ ప్రభుత్వం ఎపిలో ఏమి చేస్తున్నదని గమనించాలని ఆయన అన్నారు.మార్కెట్ లో వంద రూపాయలు ఉంటే రైతు బజారులో పాతిక రూపాయలకు ఉల్లిపాయలు అందచేస్తున్నారని కన్నబాబు అన్నారు.

అంతదాకా ఎందుకు లోకేష్ కు చెందిన హెరిటేజ్ లో ఉల్లి ధర ఎంత? రైతు బజార్ లో ఎంత ఉంది? నాందేడ్ ఎంత హోల్ సేల్ కు హెరిటేజ్ ఉల్లి తెస్తోంది?ఎంతకు అమ్ముతోంది? దాని గురించి చెప్పాలని కన్నబాబు అన్నారు. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి నిజమే అందుకని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉండదా? ఉల్లి మన రాష్ట్రంలో కూడా పండుతుంది, ధరలు నియంత్రణ అనేది రాష్ట్రం చేతిలో కూడా ఉంటుంది.

హెరిటేజ్ లో 100 రూపాయలకు అమ్ముతున్నారు అని మరొక ఆరోపణ కూడా అర్ధరహితమే కదా? ప్రభుత్వాలు స్పందించి రేట్లు తగ్గే పరిస్థితులు కలిపిస్తే హెరిటేజ్ కూడా తక్కువకే అమ్ముతుంది. ధరలు తగ్గించే బాధ్యత ప్రైవేటు సంస్థకి ఎలా ఉంటుంది? పైగా హెరిటేజ్ అనేది లిస్టెడ్ సంస్థ అందులో నిర్ణయాలు లోకేష్, చంద్రబాబు తీసుకుంటే సరిపోదు కదా? రైతు బజార్లలో అమ్మే ఉల్లికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అది కూడా ప్రజలపై భారమే. ధరలు నియంత్రిస్తేనే ప్రభుత్వం ఈ విషయంలో సక్సెస్ అయినట్టు.