YSRCP MLA Kotamreddy Granted Bailనెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటాచలం ఎంపీడీవో సరళను ఆమె ఇంటికి వెళ్లి బెదిరించారనే అభియోగంపై అరెస్టు అయ్యారు. పెట్టిన సెక్షన్లు తేలికైనవే కావడంతో వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆ తరువాత కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఇదంతా మరో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పని అన్నట్టు చెప్పుకొచ్చారు.

అధీకృత లేఅవుట్ కు నీరు ఇవ్వాలని అడిగితే ,బెదిరించారని అంటున్నారు. మరో ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి ఇవ్వద్దన్నారని చప్పారని ఆయన అన్నారు. ఆమె తనపై కాకాణికి ఫిర్యాధు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఆ ఎమ్మెల్యేకు పని గట్టుకుని ఫోన్ చేసి మాట్లాడుకుందాం అని కాకాణితో చెప్పినా ఆయన ముందుకు రాలేదని అన్నారు.

అదే సమయంలో నెల్లూరు ఎస్పికి తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, అందుకే తనను అర్దరాత్రి అరెస్టు చేశారని, తనను పిలిస్తే వచ్చి లొంగిపోయేవాడినని అన్నారు. జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నా అని అయితే ఈ కేసు వెనుక ఉన్నది ఎవరో తేలాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.

అయితే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య గొడవతో ప్రభుత్వం ఇమేజ్ ను డామేజ్ చేశారు. జిల్లాలలోని ఆధిపత్యపోరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.