Chevireddy Bhaskar Reddy- Chandragiriమాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ఊరు సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయం సాగుతుంది. ఇటీవలే మూడు రాజధానులకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సభకు మంత్రులను పిలిచి చాలా ఆర్భాటం చేశాడు చెవిరెడ్డి.

అయితే సభకు ఆదరణ కరువుకావడంతో ప్రభుత్వం అభాసుపాలు అయ్యింది. అయితే ఇంకా నారావారి పల్లె చుట్టూనే వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయం సాగుతుంది. వచ్చే ఏడాది నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టాలని నారావారిపల్లె కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు సాక్షి స్క్రోలింగ్లు వేస్తుంది.

ఇది ప్రభుత్వ విజయం అంటూ ప్రచారం చేస్తుంది. “అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలమైన తల్లిదండ్రులను రప్పించి తూతుమంత్రంగా తీర్మాణం కానిచ్చారు. మిగిలిన తల్లిదండ్రులు హాజరు కాలేదు అని రాసేసుకున్నారు. ఒక్క నారావారిపల్లెలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు,” అంటూ టీడీపీ నాయకులు చెబుతున్నారు.

ఇంగ్లీష్ మీడియం అమలుకు ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాలలో తల్లిదండ్రుల సభలు పెట్టి తీర్మానాలు చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ విధాన్ని అమలులోకి తేవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది.