YSRCP lost warangal by elections over independent candidateఅంచనాలు అందని విధంగా విజయాన్ని అందించి కేసీఆర్ కు షాకిచ్చిన వరంగల్ వాసులు, మరో వైపు జగన్ కు కూడా అలాంటి షాక్ ని ఇచ్చారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల తర్వాత అంతటి ప్రాచుర్యం గల పొలిటికల్ పార్టీగా వైకాపాకు ప్రజల్లో పలుకుబడి ఉంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజిపిలకు మొదటి మూడు స్థానాలను వదిలేస్తే, నాలుగవ స్థానంలో వైసీపీ నిలుస్తుందని అంతా అంచనా వేసారు.

కానీ, వరంగల్ వాసులు అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, జగన్ ను నాలుగుకు మించి కిందికి దించారు. నాలుగవ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి భాస్కర్ 28 వేల పై చిలుకు ఓట్లతో నిలువగా, జగన్ పార్టీ అభ్యర్ది నల్లా సూర్యప్రకాష్ రెడ్డి 23 వేల పై చిలుకు ఓట్లతో అయిదవ స్థానంలో నిలిచారు. వైసీపీ ఓటమి ఊహించినదే అయినా, ఇంతటి ఘోర ఓటమిని మాత్రం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.