YSRCP leader joining in tdpనవంబర్ 2 నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా పాదయాత్రకు సన్నధం ఆవతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం.

గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన వారే. కాబట్టి జగన్ ఆశలన్ని ఈ పాదయాత్ర పైనే. సహజంగా దానిని నిర్వీర్యం చేసే పనిలో ఉంటది పాలకపక్షం. ఒకవైపు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు జగన్ కు ఎలాను ఉంది.

ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఆపరేషన్ ఆకర్ష ను సందించడానికి సిద్ధం అవుతుంది తెదేపా. కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తో మొదలయ్యి చాలా పెద్ద లిస్ట్ ఉందని సమాచారం. నాంధ్యాల ఉపఎన్నిక, కాకినాడ మునిసిపల్ ఎన్నికల పరాజయం తరువాత ఆ పార్టీ మీద ఆ పార్టీ నాయకులకే విశ్వాసం సడలిపోయింది. వారంతా ఎప్పుడెప్పుడు పార్టీ మారిపోదామా అని చూస్తున్నారు!

ఐతే ఈ చేరికాలు ఒకదాని తరువాత ఒకటి మొత్తం పాదయాత్ర జరిగే సమయంలో పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ప్రజల దృష్టికూడా పాదయాత్ర మీద కాకుండా ఈ చేరికాల మీదే ఉంటుంది. అలాగే ప్రతి ఒకరు వైకాపా బలహీనపడుతుందనే మాట్లాడుకుంటారు.

120 నియోజకవర్గాల పాదయాత్ర తరువాత జగన్ 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర చెయ్యనున్నారు. తద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ చెయ్యాలని ఆయన ప్లాన్. పాదయాత్ర సన్నాహకల్లో భాగంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్లతో మంతనాలు జరుపుతున్నారు. ఐతే జగన్ పాదయాత్ర ముగిసేసరికి వైకాపాలో ఎంత మంది ఉంటారు? అనేది ఇప్పుడు ఆసక్తి కలిగించే ప్రశ్న.