YSRCP Leaders cerbal attack on janasena  pawan kalyanచిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా నిర్ణయించుకున్నట్టు ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. నిన్న జగన్ 100 రోజుల పాలన పై జనసేన నివేదికను విడుదల చేశారు. 100 రోజుల పాలనపై 9 అంశాలకు సంబంధించి 33 పేజీలను నివేదిక విడుదల చేసి… ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందని తేల్చారు. మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే అందుకు విరుద్ధంగా ఉందని పవన్‌ అభిప్రాయపడ్డారు. పారదర్శకత, దార్శనికత లోపించినట్లు తమ నివేదికలో తేల్చారు.

151 ఎమ్మెల్యేలతో గెలిచిన ప్రభుత్వం సహజంగానే విమర్శను తట్టుకోలేదు అందులోనూ గతంలో జగన్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. 2014లో తాము అధికారంలోకి రాకపోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇవ్వడమే కారణమని జగన్ పూర్తిగా విశ్వసిస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ పై తమ నేతలను ఉసిగొలిపారు ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ ఆ నివేదిక విడుదల చేసిన దగ్గర నుండి అంతా ఆయనను తిడుతూనే ఉన్నారు.

బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్, రోజా, అంబటి రాంబాబు వంటి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను పెయిడ్ ఆర్టిస్టు అని, ప్యాకేజీ కళ్యాణ్ అని రకరకాల మాటలతో దూషిస్తున్నారు. రెండున్నర ఏళ్ళలోనే పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ ఇప్పటికే చెప్పడంతో ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా ముఖ్యమంత్రి దృష్టిలో పడవచ్చు అని చెలరేగిపోతున్నారు. వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టే రెండవ స్థాయి నేతలు జనసేనకు లేకుండా పోయారు.