YSRCP Kovur MLA dharna at police stationఆంధ్రప్రదేశ్ లో సహజంగా అధికార పార్టీ వారికి అడ్డూ అదుపు లేకుండా ఉంటుంది. కరోనా టైం లో కూడా వారిని ఆపే వారు లేరు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తమను అడిగే వారు లేరు అన్నట్టు తిరుగుతున్నారు. ఏమైందో ఏమో గాని ఎలాగో కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది.

అప్పట్లో కేసు నమోదు చేసిన వెంటనే పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు సదరు ఎమ్మెల్యే. అయితే ఆ వివాదంలో అధికారులు నోటీసులివ్వడంపై ఎమ్మెల్యే మీడియా ముఖంగానే బెదిరింపులకు దిగారు. “ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. దమ్ముంటే నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టండి. పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తే కేసులు నమోదు చేస్తారా. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులపై కేసులు పెడతారా?,” అంటూ బెదిరించారు.

నాతో ఉన్న ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా ఊరుకునేది లేదు. ఏసీ గదుల్లో కూర్చుని వందల మందితో మీటింగ్లు ఎలా నిర్వహిస్తున్నారు?. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, పోలీసులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఇతర సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. మీరేమో జిల్లా కేంద్రంలో ఏసీ గదుల్లో కూర్చుంటున్నారు అంటూ ఎస్పీ, కలెక్టర్;పై తీవ్ర విమర్శలు చేశారు.

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం ఒక ఎత్తు అయితే… ఆ తరువాత కూడా కనీసంగా విచారం లేకపోవడం, పై పెచ్చు ప్రభుత్వ అధికారులను బహిరంగంగా బెదిరించడం.. ఇవన్నీ వైకాపా ఎమ్మెల్యేలకే చెల్లింది. అయితే ముఖ్యమంత్రి దీనిపై స్పందించకపోవడం, తాము ఏం చేసినా ఎవరికీ సంజాయిషీ ఇవ్వనక్కర్లేదు అన్నట్టు ఉండటం శోచనీయం.