Why is Jagan So Desperate?మరో 24 రోజులలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ప్రతిపక్ష ఒకింత ఎక్కువగానే నమ్మకంగా ఉంది. ఆ పార్టీ నేతలు అప్పుడే పదవులు పంచేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నీకు ఇది నాకు అది అంటూ వాటాలు వేసేసుకుంటున్నారట. ఇది ఇలా ఉండగా చంద్రబాబు మీద జగన్, విజయసాయి రెడ్డి ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కారణం కాంగ్రెస్ తో చేతులు కలిపి తమను కటకటాల పాలు చేశారని వారి నమ్మకం.

ఇప్పుడు చంద్రబాబుకు అదే గతి పట్టించాలని ఉబలాటపడుతున్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామని వారు బాహాటంగానే చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు తరువాత జగన్ టార్గెట్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుండి ఉమ జగన్ ను తీవ్రంగా విమర్శించే వారు. పైగా పోలవరం పనులు ఆయనే దగ్గరుండి పరీక్షించారు. దీనితో చంద్రబాబుతో పాటు ఉమను కూడా జైలుకు పంపడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మైలవరంలో ఉమను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేసింది. మాజీమంత్రి కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ను అభ్యర్థిగా దించింది. భారీగా డబ్బు ఖర్చుపెట్టింది. దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని భావించిన దేవినేని ఆశలు ఆవిరేనని వైకాపా వారు అంటున్నారు. దీనితో మే 23న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఉమ మాత్రం తన గెలుపుపై టీడీపీ గెలుపు మీద ధీమాతో జగన్ మీద విమర్శలు మరింత పెంచారు.