YSRCP-Jagan-Kuppam-Tour-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటి నుంచి వ్యవసాయాధారిత రాష్ట్రమే కనుక రాష్ట్రంలో పాడి పశుసంపదకు కొదవలేదు. అందుకే ఇన్ని దశాబ్ధాలుగా రాష్ట్రంలో సంగం, హెరిటేజ్, విశాఖ వంటి అనేక చిన్నా పెద్దా డెయిరీఫారంలు నడుస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దశాబ్ధాలుగా ప్రతీరోజు లక్షలాది లీటర్ల పాలు సేకరించి నిరాటంకంగా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ డెయిరీ వ్యవస్థ చాలా బలంగా ఉన్నందునే ఇంతకాలం ఇతర రాష్ట్రాలలో ఎంతో పేరుమోసిన ప్రైవేట్ డెయిరీలు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టలేకపోయాయి.

కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ఆర్ధికమూలాలను దెబ్బ తీస్తూ ఆ పార్టీని బలహీన పరిచేందుకు ప్రయతీస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ముందుగా టిడిపి సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగం డెయిరీలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయనను తప్పించేశారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుటుంబం అధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ డెయిరీపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానిని దెబ్బతీసేందుకే అమూల్ డెయిరీని తీసుకువచ్చింది. ఈ విషయం సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుప్పం బహిరంగసభలో పరోక్షంగా చెప్పారు.

“రాష్ట్రంలో నా అక్కలు, చెల్లెమ్మమలు, అన్నలు, తమ్ముళ్ళని ఇంతకాలం హెరిటేజ్ డెయిరీ దోచుకొనేది. కానీ అమూల్ డెయిరీ వచ్చి పాలసేకరణ ధర పెంచడంతో హెరిటేజ్ డెయిరీ కూడా పెంచకతప్పలేదు. మీ అందరికీ మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే అమూల్ డెయిరీని రాష్ట్రానికి రప్పించి దాంతో ఒప్పందం చేసుకొన్నాము,” అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

అంటే రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన హెరిటేజ్‌ డెయిరీ జాతీయస్థాయికి చెందిన అమూల్ డెయిరీతో పోటీ పడవలసిన పరిస్థితి కల్పించారన్న మాట! ఒకవేళ దాంతో పోటీ పడలేకపోతే నష్టపోయి చ్వరికి మూసుకోక తపదన్న మాట!

అమూల్‌ని రప్పించడానికి అసలు కారణం ఇదైతే రాష్ట్రంలో పాడిరైతులకు మేలు చేసేందుకే తీసుకువచ్చామని కుప్పంలో జగన్‌ చెపుకొన్నారు. ఇంత దూరదృష్టి రాష్ట్రాభివృద్ధిపై చూపి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దేశంలోనే నంబర్: 1 స్థానంలో ఉండేది కదా?