YSRCP involved - AP for Mass Vote Deletion pplications-తెలుగుదేశం పార్టీకి చెందిన సేవ మిత్ర యాప్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను దుర్వినియోగం చేస్తుందని హైదరాబాద్ కు చెందిన ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీపై దాడులు చేశారు తెలంగాణ పోలీసులు. కంప్లయింట్ ఇచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ సెల్ లో పని చేసే ఒకతను. దీనితో టీడీపీని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్, తెరాస నేతలు. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 8 లక్షల వరకు ఫారమ్ 7 దరఖాస్తులు (ఓట్లు తీసెయ్యమని చేసే దరఖాస్తులు) వచ్చాయి,

వాటిలో 6 లక్షల అప్లికేషన్లు 10 రోజుల లోపలే రావడంతో విచారణకు ఆదేశించింది ఎన్నికల సంఘం. దాదాపుగా 45 కేసులు కూడా నమోదు చేసింది. ఈ రెండిటికి సంబంధం ఉందని టీడీపీనే డేటాను దుర్వినియోగ పరచి ఓట్లు తీసేస్తుందని వైకాపా ఆరోపణ. అయితే సేవ మిత్రలో ఎటువంటి డేటా లీక్ జరగలేదని, అదే సమయంలో ఫారమ్ 7 దరఖాస్తులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పని అని వాదిస్తుంది టీడీపీ. ఇందులో నిజానిజాలు పోలీసులు, కోర్టులు తేల్చాలి.

అయితే ఒక చిన్న లాజిక్ ను లెక్కలోకి తీసుకుంటే ఫారమ్ 7 వివాదంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పాత్రపై అనుమానాలు రాకమానవు. ఫారమ్ 7 దరఖాస్తులు తక్కువగా వచ్చినవి కడప, కర్నూల్ జిల్లాల నుండి. ఈ రెండు జిల్లాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కంచుకోటలు. ఇది టీడీపీ పని అయితే ఎక్కువ ఓట్లు తీసెయ్యడానికి ఈ జిల్లాల నుండే ఎక్కువ ప్రయత్నాలు జరిగేవి. కాబట్టి ఇప్పుడు అనుమానాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద ఉండటం సహజం. ఏది ఏమైనా ఏ పార్టీ చేసిన ఓట్లను తీసి వేసి గెలవాలి అనుకోవడం రాజకీయాలలో కొత్త లోతు అనే చెప్పుకోవాలి.