Jagan  - Vijay Sai Reddyవిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పోకడే విచిత్రంగా ఉంది. మొన్న కేంద్ర క్యాబినెట్ లో ఉంటూ సుజనా చౌదరి ఎలా ఆంధ్ర తరపున మాట్లాడతారు అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్లమెంట్ లోనే అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు తాజాగా కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రంపైనే కోర్టుకు వెళతామని ఎపి టిడిపి ప్రభుత్వం లీకులు ఇస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎద్దేవ చేసింది.

కేంద్రంపై విభజన హామీలు నిరవేర్చకపోవడం కోర్టుకు వెళదామని ప్రభుత్వం భావిస్తుంది. దీనిని వైకాపా తప్పు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. కేంద్రంపై కేసులు అంటే బీజేపీ నాయకులకంటే కూడా ప్రతిపక్ష పార్టీ ఎక్కువ బాధ పడిపోవడం గమనార్షం. ఇప్పటివరకు కేంద్ర బడ్జెట్ గురించి చంద్రబాబుని నిందించారేగానీ మోడీని పల్లెత్తు మాట అన్నది లేదు జగన్.

పోనీ ఆ కేసులు ఏవో కేంద్రంలో అధికారంలో లేని వారే వెయ్యవొచ్చు కదా. అలా చేస్తే ఎక్కడ సీబీఐని పంపుతారో అని భయం అని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎంపీల రాజీనామా నిర్ణయంకూడా త్రిపుర, కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి ఇబ్బంది అవ్వకుండా దానిని ఏప్రిల్ వరకు పొడిగించినట్టుగా కనిపిస్తుంది.