ysrcp-gudivada-nani-vs--avinash-devineniదేవినేని అవినాష్ టీడీపీ అభ్యర్థిగా రావడంతో వైకాపా గుడివాడ కోట కదులుతుంది. వరుసగా మూడు సార్లు గెలిచిన కొడాలి నాని ఈ సారి భయపడినట్టుగా కనిపిస్తున్నారు. అవినాష్ కు వ్యతిరేకంగా కమ్మ – కాపు కులస్థుల మధ్య చిచ్చు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కాపులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. “వంగవీటి రంగను చంపిన నెహ్రూ కొడుకు అవినాష్ కు ఓటు వేస్తారా అంటూ వారిని రెచ్చగొడుతున్నారు.

“కమ్మ వారంతా నన్ను ఓడించడానికి చూస్తున్నారు. దేవినేని అవినాష్ గెలిస్తే కమ్మ వారికే న్యాయం జరుగుతుంది,” అంటూ ప్రచారం చేస్తున్నారు కొడాలి. ఇక్కడ విశేషం ఏమిటంటే కొడాలి నాని కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం. ఇంకో విశేషం ఏమిటంటే వంగవీటి రంగ తనయుడు రాధా ఇప్పుడు టీడీపీలో ఉండటం. టీడీపీ నాయకత్వం అవసరమైతే వంగవీటి రాధా ను దేవినేని అవినాష్ కు మద్దతుగా ప్రచారంలోకి దింపాలనే ఆలోచనలో ఉంది.

మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇప్పుడు గెలుపు కోసం కులాల మధ్య కుంపటి రాజెయ్యాలని చూడటం విశేషం. మరోవైపు వరుసగా మూడు సార్లు గెలిచినా మూడు సార్లూ ప్రతిపక్షంలో ఉండడంతో గుడివాడలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇది నానికి ప్రతికూల అంశంగా తయారయ్యింది. అయితే ఈ సారి గెలిస్తే తనకు జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిపదవి గారంటీ అని మరొక్కసారి అవకాశం ఇవ్వాలని నాని ప్రజలని అడుగుతున్నారు. మొత్తానికి అవినాష్ రాకతో గుడివాడ రాజకీయం రసకందాయంలో పడింది.