YSR-Congress-Activated-TDP's-Social-Media-Forcesఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. అది నిజం అన్నట్టుగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించారు. అయితే శాసనసభలో ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కూడా అమరావతికి అనుకూలంగా అయితే లేవు. కేవలం 500 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన చర్యను సమర్ధించుకున్నారు.

గత ప్రభుత్వం కంటే మేమె ఎక్కువ కేటాయించాము రాజధానికి అంటున్నారు ఆయన. కేంద్రం ఇచ్చిన 1500 కోట్లను ఖర్చు చేసి అప్పటి ప్రభుత్వం భవనాలు నిర్మిస్తే ఎంత అద్వాన్నంగా ఉన్నాయో చూస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐదువేల రూపాయలకు ఒక అడుగు నిర్మిస్తే, ఇక్క డ మాత్రం అడుగుకు పన్నెండువేల రూపాయలు వ్యయం చేశారని బుగ్గన చెప్పారు. అయినా అత్యంత నాసిరకంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

ఇంతా చేస్తే ఈ భవనాలకు కిటికీలు లేవని, దాంతో ఇక్కడ పనిచేస్తున్న అదికారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కుంటున్నారని, ఆ విషయం అధికారులే చెబుతున్నారని బుగ్గన వివరించారు.ఇక్కడ వర్షం కురిస్తే బయట కన్నా, భవనాలలోనే వర్సం ఎక్కువ నీరు ఉంటోందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించాం అని బుగ్గన అనుకోవచ్చు గానీ ఆ క్రమంలో అమరావతిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని గ్రహించలేకపోతున్నారు.