sujay-krishna-ranga-rao-joining-TDPsujay-krishna-ranga-rao-joining-TDPవిజయనగరం జిల్లాలో జగన్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. వైకాపాకు రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయనల నేతృత్వంలో భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. జిల్లాకు చెందిన 58 మంది సర్పంచ్ లు, 85 మంది సర్పంచ్ లు, ముగ్గురు జడ్ పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు కో-ఆపరేటివ్ సంఘాల అధ్యక్షులు సహా మొత్తం 159 మంది ‘సైకిల్’ ఎక్కడం విశేషం.

క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలి… రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి, పట్టుదలకు మనమంతా సహకరించాలి… కానీ వైకాపాలో ఆ పరిస్థితులు కనపడడం లేదు, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి మేమంతా టిడిపిలో చేరాం” అంటూ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అలాగే మరో ఎమ్మెల్యే బేబీ నాయన ప్రసంగిస్తూ… “తన వివాహానికి కుటుంబ సభ్యులు అక్షింతలు మాత్రమే వేశారని, కానీ అన్నీ దగ్గరుండి చేసింది మాత్రం తన నియోజకవర్గపు ప్రజలేనని, అందుకే తన నియోజకవర్గం అంటే కుటుంబంతో సమానమని, తమపై ఇంత ప్రేమాభిమానాలు చూపించే నియోజకవర్గ ప్రజలకు ఏం చేసి రుణం తీర్చుకోగలమని, ఒక్క అభివృద్ధి చేసి చూపించడం తప్ప… అంటూ కాస్త భావోద్వేగాల మధ్యలో స్పీచ్ ఇచ్చారు ఈ శ్రీకాకుళం నేత.