ysrcp controversy over vizag LG polymer gas leakవిశాఖపట్నంలోని ఎల్జీ పొలిమెర్స్ అనే సంస్థ నుండి విషపూరితం గ్యాస్ లీక్ అయ్యి కలకలం సృష్టించింది. ఇప్పటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా… దాదాపుగా 1000 మంది దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. 300-400 మంది దాకా హాస్పిటల్ లో ఉన్నట్టు సమాచారం. కంపెనీ చుట్టూ ఉన్న 20 గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా…. అధికార పార్టీ ఈ విషయంలో రాజకీయం మొదలు పెట్టిందని ఆరోపణ. విశాఖపట్నం రాజధాని కాకుండా ఆపడానికి ఇది తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అమరావతిని ఇబ్బంది పెట్టడం వల్లే విశాఖపట్నానికి ఈ దుస్థితి వచ్చిందని ‘నర్రా శ్రీనివాస చౌదరి’ అనే అమరావతి మద్దతుదారుడు పోస్టు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు.

అయితే ట్విట్టర్ లో అటువంటి పేరుతో ఎటువంటి అకౌంట్ లేకపోవడం గమనార్ధం. ట్విట్టర్ తమ అకౌంట్ల యూజర్ నేమ్ లలో 15 ఆల్ఫాబెట్లకు మించి అనుమతించదు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ సర్క్యూలేట్ చేస్తున్న స్క్రీన్ షాట్ లో యూజర్ నేమ్ అంతకు మించి ఉండటంతో అది కేవలం రాజకీయ ప్రచారమే అని తేలిపోయింది.

ఇది ఇలా ఉండగా…. గతంలో విశాఖ లో చంద్రబాబు పర్యటనను వైఎస్సార్ కాంగ్రెస్ వారు అడ్డుకోవడంతో విశాఖ వెళ్లేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. చంద్రబాబు విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించి, పార్టీ తరపున సహాయ చర్యలు చేపట్టేందుకు బాబు కేంద్రం అనుమతి కోరారు. కేంద్రం అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు కాసేపట్లో విశాఖ చేరుకుంటారు.