ABN-Andhrajyothy Making Big Stride in AP and Telanganaకొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ మండలి, ముఖ్యమంత్రిపై జుగుప్సాకరమైన కార్టూన్లు, వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు వైకాపా కార్యకర్తలని అరెస్ట్ చేసారు. అప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు అంటూ గగోలు పెట్టారు సాక్షి పత్రిక వారు మరియు వైకాపా నాయకులు. అందులో ఒకరు ముఖ్యమంత్రి కుటుంబంలోని ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అది వ్యక్తిగత స్వేచ్ఛే.

అయితే ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది అని, దానివల్ల ఆయన పరువు.. ప్రతిష్టను దెబ్బ తీసినందుకు పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్‌ వెంకట శేషగిరిరావు, ఎడిటర్‌ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక కేసు వేశారు.

ఇప్పుడు అదే కేసులో ఆంధ్రజ్యోతే అధిపతి వేమూరి రాధాకృష్ణను కోర్టు గుమ్మం ఎక్కించాలని చూస్తున్నారు కూడా. తద్వారా ఆంధ్రజ్యోతిని నియంత్రించాలని, ఆ పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా చూసుకోవాలని వైకాపా ఉద్దేశం. వచ్చే నెల ఐదున తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని .వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురికి కండీషనల్‌ ఆర్డర్‌ జారీ చేసింది కూడా.

అయితే ఇలాంటి సందర్భాలలో మాత్రం ఆ పార్టీ నాయకులు సులువుగా వాడేసే వ్యక్తిగత స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ ఏమయ్యాయో! ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రకారంగా రోజు సాక్షిలో వచ్చే కధనాల పై పరువు నష్టం దావాలు చంద్రబాబు, లోకేష్ వేస్తూ పోతే అసలు ఆ పార్టీ బ్రాంచ్ ఆఫీస్ కోర్టులు దగ్గరే పెట్టుకోవాలని తెలుగు దేశం నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు