Comedian-Prudhvi-Raj-Mocks-Pawan-Kalyan-Zero-Budget-Politicsథర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విని కీలకమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవి వరించినా ఇంకా ఆయన రాజకీయ నాయకుడిగానే మిగిలిపోతున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ గా స్వామివారి కృప కోసం తపించాల్సింది పోయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకోవడానికే పరితప్పిస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలను ఎలాగైనా జగన్ వద్దకు తీసుకుని రావాలని ఆయన తాపత్రయ పడుతున్నారు.

అయితే ఏ వేదిక లోనైనా అదే పాట పాడటం ఆయన చేపట్టిన పదవి స్థాయికి తగినట్టు లేదు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ…చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు.. జగన్‌ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందరాని పృథ్వీరాజ్‌ గుర్తు చేశారు. సీఎం జగన్‌ను ఎవరు విమర్శించిన తాట తీస్తానంటూ హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ లోకేష్‌ పుట్టడని పృథ్వీరాజ్‌ ఎద్దేవా చేశారు.

స్వామి వారి సేవలో తరించాల్సిన ఎస్వీబీసీ చైర్మన్ తాట తీస్తా… పులి కడుపున ఫులే పుడుతుంది… అటువంటి మాటలు మాట్లాడటం ఎంత మాత్రం తగదు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా అవి ఉంటున్నాయి. ఈ విషయం పృథ్వికి అర్ధం కాకపోయినా ముఖ్యమంత్రి లేక ప్రభుత్వంలోని పెద్దలు ఆయనకు అర్ధం అయ్యేలా చెబితే అందరికీ మంచిది. ఇది ఇలా ఉండగా పృథ్వి ప్రవర్తనా శైలిపై ఇండస్ట్రీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ వైఖరి వల్ల ఆయనకు ఇప్పటికే అవకాశాలు కూడా తగ్గిపోయాయి.