YS - Jagan Mohan Reddyవైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్డీఏలోకి రావాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే ఆహ్వానించారు. జగన్‌ వస్తానంటే భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీని తాను ఒప్పిస్తానన్నారు. జగన్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవడానికి సహకరిస్తామన్నారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు బీజేపీకు మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్టు తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు దోహదం చేసేలా ఉన్నాయి కేంద్ర మంత్రి వ్యాఖ్యలు. అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తు ఉండదు అని తేల్చి చెప్పినా ఇటువంటి సందర్భాల్లో ఎందుకనో ఆ పార్టీ నేతలు గట్టిగా ఖండించలేకపోతున్నారు.

దీనితో అసలుకే మోసం వచ్చేలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో బీజేపీ అంటరాని పార్టీగా మిగిలిపోయింది. బీజేపీతో ఎవరు జత కట్టినా వాళ్ళు కూడా మునగడం ఖాయంగా కనిపిస్తుంది. దీనితో మీకు బీజేపీ తో చీకటి ఒప్పందం ఉందంటే మీకు ఉంది అంటూ ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.