forget-babai-viveka-forget-21-kids-who-committed-suicide-ys-jagan-resorts-to-petty-politicsఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫలితాలతో సంబంధం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం దాదాపుగా ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మెజారిటీకి దూరంలో ఆగిపోతే జగన్ బీజేపీకి అక్కరకు వస్తారు. అలాగే పీకల మీదకు వస్తున్న అవినీతి కేసుల రక్షణ కోసం బీజేపీ సపోర్టు జగన్ కు అవసరం.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కు చాలా చేసేశాం ఆ సొమ్ముని చంద్రబాబు నాయుడు తినేశాడు అనే బీజేపీ లైన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఫొని తుఫాను నేపథ్యంలో విజయసాయి రెడ్డి వేసిన ఒక ట్వీట్ దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనిబట్టి వారి ఇద్దరి మధ్య స్నేహం ఎక్కడ దాకా వెళ్ళిందో అర్ధం చేసుకోవచ్చు.

“ముందస్తు సహాయ పనులకు కేంద్రం రూ.200 కోట్లు విడుదల చేసిందని మీడియాలో వచ్చింది. గతంలో ఇలా కేటాయింపులు జరిపిన విషయం బయటకు తెలిసేది కాదు. వచ్చిన డబ్బు ఏమయ్యేదో చెప్పేవారు కాదు. కలెక్టర్లు, ఉద్యోగుల శ్రమను అంతా తానే చేసినట్టు చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేవాడు,” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ముందస్తు డబ్బు కేంద్రం ఎప్పుడూ ఇచ్చింది లేదు. ఏదో ఎన్నికలు గనుక ఇచ్చింది. విజయసాయి రెడ్డి గారు అదో ఘనకార్యం లాగా. ఎప్పుడూ ఇచ్చే వారు అన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చేశారు. విశేషం ఏమిటంటే బీజేపీ నాయకులు కూడా ఇలా బాకా ఊదుకోలేదు.