YSRCP behaving like BJP branch office in andhra pradeshఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంటుంది. అదే విధంగా జంప్ జిలానీలు వీరంగం చేస్తున్నారు. ఇటీవలే దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వైఎస్ జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. అతను వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి పర్చూరు టిక్కెట్టు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నట్టు స్పష్టం చేశారు. ఇటీవలే గుంటూరులో ప్రధాని నరేంద్ర మోడీ మీటింగులో ఆయన పక్కనే కూర్చున్నారు ఆవిడ.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకుని వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేర్పించడమే కాకుండా వేరే నేతలను కూడా పార్టీలోకి తెస్తున్నారు. దీనిబట్టి ఆయన పార్టీ కోసం ఎలా పని చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు బీజేపీ నరసాపురం ఎంపీ గోకరాజు రంగరాజు కూడా ఇదే ప్రయత్నాలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు బీజేపీ టిక్కెట్టు ఇస్తుందో లేదో తెలీదుగానీ ఆయన తన కుమారుడిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఆయన మాత్రం బీజేపీ లోనే కొనసాగబోతున్నారని తెలుస్తుంది.

ఇటువంటి రాజకీయానికి ఇరు పార్టీలు అడ్డు చెప్పకపోవడం విశేషం. గుంటూరు నుండి పోటీ చెయ్యబోతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గెలుపుకు కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పరోక్షంగా సహకరించబోతుంది అని పుకార్లు చాలా కాలం నుండి రాజకీయ వర్గాలలో ఉన్నాయి. ఇటీవలే జరిగిన ప్రధాని గుంటూరు మీటింగుకు వైకాపా జనసమీకరణకు సాయం చేసింది అనే వదంతులు ఉన్నాయి. దీనితో ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ బీజేపీ బ్రాంచ్ ఆఫీసా? లేదా ఆ పార్టీ బీ టీమా అనే అనుమానాలు రాకమానవు.