YSRCP attacks on Janasena party leaders panchakarla sandeepచంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, ఏకవచన సంబోధన దుమారాన్ని రేపాయి. మూడు రాజధానులు మద్దతుగా ఆయన ఒక ర్యాలీ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, మాజీ మంత్రి లోకేశ్‌లను ఆయన రాయలేని పదజాలంతో దూషించారు.

ద్వారంపూడి అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ .. కాకినాడ భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే కొందరు కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకోగా వారిపై అధికార పార్టీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో స్పెషల్‌ బ్రాంచి పోలీసులను భారీగా మోహరించారు. ఘటన తర్వాత కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముందు దాడి చేసిన అధికార పార్టీ వారిని అరెస్టు చెయ్యలేదని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు.తమ నాయకులను వైసీపీ నేతలు వెంటాడి మరీ కొట్టారని.. ఇదంతా పోలీసుల ఎదుటే జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉన్నట్టు సమాచారం.