Amaravati-Maha-Padayatra-YSRCP-Attackఅమరావతిని రాజధానిగా చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాదయాత్ర నేడు రాజమండ్రికి చేరుకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలే వారి పాదయాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డుకొంటామని బెరిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం రైతుల పాదయాత్ర రాజమండ్రిలోని ఆజాద్ చౌక్ చేరుకొనే సమయానికి, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మార్గాని భారత్ అధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ సభ నిర్వహించింది.

రైతులు అక్కడికి చేరుకొనేసరికి వారికి నిరసన తెలిపేందుకు నల్ల బెలూన్లతో అక్కడ సిద్దంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు వారిపై చెప్పులు, కుర్చీలు విసురుతూ దాడి చేశారు. దాంతో సహనం కోల్పోయిన రైతులు, వారి పాదయాత్రలో పాల్గొన్న ప్రతిపక్ష కార్యకర్తలు కూడా వారిపై చెప్పులు విసిరారు. ఇటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని ముందే ఊహించిన పోలీసులు ఆ ప్రాంతంలో దారి పొడవునా బారికేడ్స్ ఏర్పాటు చేశారు కనుక ఇరువర్గాలు చెప్పులు, రాళ్ళు విసురుకోవడంతో సరిపెట్టారు లేకుంటే వారి మద్య ఘర్షణలు జరిగి ఉండేవి.

వారు రైతుల ముసుగులో ఉన్న టిడిపివారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వారి పాదయాత్రకు మద్దతుగా టిడిపితో సహా జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కార్యకర్తలు కూడా తమతమ పార్టీ జెండాలతో పాల్గొన్నారు. అంటే రైతుల పాదయాత్రకు ఒక్క వైసీపీ తప్ప రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని స్పష్టం అవుతోంది. మరి అటువంటప్పుడు అది టిడిపి యాత్ర అని వైసీపీ ఏతలు ఏవిదంగా ఆరోపిస్తున్నారు?

అసలు పాదయాత్ర చేస్తున్న రైతులను వైసీపీ ఎందుకు అడ్డుకోవాలనుకొంటోంది?అంటే ఒకటి అభద్రతాభావం రెండోది ఓటు బ్యాంక్ రాజకీయాలు కారణాలుగా కనిపిస్తున్నాయి.

రైతుల పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకపోతే వారు దారిపొడవునా ఎక్కడికక్కడ ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు. అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుంది కనుక అభద్రతాభావానికి గురవుతోంది. కనుక వారిని ఈవిదంగా అడ్డుకొంటే అప్పుడు వారూ కూడా ఆవేశంతో ప్రతిస్పందిస్తారు. అప్పుడు రైతులు పాదయాత్రతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందనే సాకుతో పాదయాత్రను నిలిపివేయించవచ్చు. ప్రజలను ఈవిదంగా రెండు వర్గాలుగా చీల్చగలిగితే వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చని వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది.

Watch and Subscribe for Exclusive Industry Interviews: