ysrcp and tdp clashes in Kuppam-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సొంత ఇలాకాలో టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్. మొన్న ఆ మధ్య చంద్రబాబు సొంత ఊరు, నారావారిపల్లెలో సభ పెట్టి అధికారపక్షం ఆబాసుపాలు అయ్యింది. ఇప్పుడు చంద్రబాబుని సొంత నియోజకవర్గం కుప్పంలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.

వివరాల్లోకి వెళ్తే… చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి రెండు రోజులపాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు టీడీపీ కార్యకర్తలను కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం పట్టణం అంతా వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్లెక్సీలతో నిండిపోయి ఉంది. వారం క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు పెట్టిన ఆ పార్టీ ఇప్పుడు తొలగించడం లేదు.

పర్యటన అయిపోయినా మా ఫ్లెక్సీలు ముట్టుకుంటే ఊరుకునేది లేదు అని అంటున్నారు. దీనితో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలకు చోటు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా కవ్వించే ప్రయత్నాలు చెయ్యడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 1989 ఎన్నికల నుండి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏడు సార్లు గెలుస్తూ వస్తున్నారు.

చంద్రబాబు పై గత రెండు ఎన్నికలలో పోటీ చేసిన వైసీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళి వ్ర అనారోగ్యం కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేక పోయారు. ఇప్పుడు ఆయన తప్పుకుని ఆ సీటుని తన కుమారుడు భరత్ కు ఇప్పిస్తున్నారు. ఈ ఐదు సంవత్సరాలు భరత్ ని బాగా ప్రోత్సహించి చంద్రబాబుని దెబ్బ కొట్టాలని సీఎం జగన్ వ్యూహమట.