Mudragada Padmanabham, YSRCP Supports Mudragada Padmanabham, YSRCP Ambati Rambabu Supports Mudragada Padmanabham, YSRCP Supports Mudragada Padmanabham Agitation, YSRCP Supports Mudragada Padmanabham Kapu Agitation, YSRCP Supports Mudragada Padmanabham Kapu Reservationకాపులను బీసీల్లో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం చెప్పిన గడువు సమీపిస్తుండడంతో కాపు నేతలు మరోమారు సమావేశాలలో మునిగి తేలుతున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా హైదరాబాద్‌ లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నివాసంలో జరిగిన భేటీ అయ్యి, చిరంజీవి, పళ్లంరాజు, బొత్స సత్యానారాయణ, ఉమ్మారెడ్డి, వైసీపీ నేత అంబటి రాంబాబు తదితర కాపు నేతలు చర్చలు జరిపారు.

రిజర్వేషన్లను త్వరగా అమలు చేసే విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలన్న అంశాన్ని చర్చించారు. తూతూమంత్రంగా బంద్‌ లు, రాస్తారోకోలు నిర్వహించడం కాకుండా కాస్త గట్టిగానే ఉద్యమించాలని కాపు నేతలు నిర్ణయించారు. కాపు ఉద్యోగులపై వివక్ష కొనసాగుతోందని భేటీలో పాల్గొన్న కొందరు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 11వ తేదీన రాజమండ్రిలో 13 జిల్లాల కాపు సంఘాల నేతలతో ముద్రగడ సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశం అనంతరం రిజర్వేషన్ల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని కాపునేత ముద్రగడ తెలిపారు. ‘ప్రభుత్వం ఇస్తున్న హామీలనే అడుగుతున్నాం. దీంతో మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయం తేల్చకుండా ఏదోదో మాట్లాడడం సరికాదు. 11వ తేదీన మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఆందోళన ఎలా చేయాలనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం’ అని ముద్రగడ పేర్కొన్నారు. ఆయన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన ఒంటరి కాదని, ఆయన వెంట మేమున్నామని అంబటి రాంబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.