ab venkateswara raoఏపీ ఇంటలెజిన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రంలోని తమ స్నేహాలతో బదిలీ చేయించుకుంది వైఎస్సార్ కాంగ్రెస్. అయినా ఆ పార్టీకి ఆ అధికారి పట్ల అభద్రతాభావంతోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పటికీ అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కిందిస్థాయి ఉద్యోగులు ఏబీ వెంకటేశ్వరరావుకు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు ఇంటలెజిన్స్‌ విధుల్లో కలుగజేసుకోకుండా.. అదే విధంగా ఆయన ఇచ్చిన గత నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావును ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. అయితే ఈ పిటిషన్‌ విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హై కోర్టు. అంటే పోలింగ్ కు రెండు రోజుల ముందు అన్నమాట.

దీనితో ఈ పిటిషన్ వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభద్రతాభావం భయటపడటం తప్ప పెద్దగా ఉపయోగం లేదు అనే చెప్పుకోవాలి. సోమవారం ఈ కేసు హియరింగ్ కు వస్తే ఇరుపక్షాల వాదనలు వినడానికి కోర్టుకు 2-3 రోజులు పడుతుంది. ఈలోగా పోలింగ్ కూడా పూర్తి అవుతుంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగబోతుంది. మే 23న ఫలితాలు వెలువడతాయి. అంటే పోలింగ్ తరువాత దాదాపుగా ఫలితాల కోసం నెలన్నర పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. మే 23 తరువాత ఏబీ వెంకటేశ్వరరావుతో జగన్ శాల్యూట్ చేయించుకునే పరిస్థితి ఉంటుందో లేదో చూడాలి.