Dr Appalaraju Seediri MLAకోర్టు తీర్పుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై న్యాయస్థానం కన్నెర్రజేసినా ఆ పార్టీ నేతలలో మార్పు కనిపించడం లేదు. తాజాగా ప్రభుత్వ పాలనా విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు.

“కోర్టు తీర్పులతో మేము ఏకీభవించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు ప్రజలు కూడా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదించే పరిస్థితి వస్తుంది. అప్పుడు 44 మందికికాదు… 4 కోట్ల మందికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది” అని ఆయన బహిరంగంగానే విమర్శించడం విశేషం.

“నిమ్మగడ్డ మీద టీడీపీ నేతలకు ఉన్న ఆసక్తి, ప్రయోజనం ఏంటి? ఆయన్నే కొనసాగించాలని వారు అడగడంలో అర్థం ఏమిటి? నిమ్మగడ్డకు, టీడీపీకి ఉన్న సంబంధమేంటి?,” ఆయన ప్రశ్నించడం విశేషం. చంద్రబాబు హయాంలో నియమితులైన నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉండడం తమకు ఇష్టం లేదని చెప్పారు

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే… నిమ్మగడ్డ విషయంలో కోర్టుని ఆశ్రయించింది బీజేపీ నేత శ్రీనివాస్. కేసు గెలిచినందుకు ఆ పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఏది జరిగినా అది టీడీపీ వల్లే. మరి అది బీజేపీ ని అనడానికి భయం వల్లో లేదా వారి తెలిసీతెలియని తనమో