ysr-kanti-velugu-ys-jagan--ysrcpప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి అంటూ ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో గురువారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుందని ప్రకటించారు. ప్రజారోగ్య రంగంలో ఇదో విప్లవాత్మక కార్యక్రమం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ మీడియా ఊదరగొడుతుంది. అయితే ఇందులో తిరకాసు ఏంటంటే ఇది ఇప్పటికే ఉన్న పథకం…. కొత్త ప్రభుత్వం కొత్త పేరుతో రీ-లాంచ్ చేస్తుంది.

చంద్రబాబు హయాంలో ముఖ్యమంత్రి-ఈ-ఐ-కేంద్రాలు. ఆ స్కీం లో ఇప్పటికే అనేక మందికి ఉచ్చితంగా కంటి పరీక్షలు, కళ్ళజోళ్ళు, శాస్త్రచికిత్సలు జరిగేవి. కాకపోతే ఆ స్కీం ను అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేసుకోలేదు. దానితో లబ్దిదారులకు తప్ప పెద్దగా ఎవరికీ తెలీదు.

దానితో దాని పేరును ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ గా మర్చి అట్టహాసంగా మొదలు పెడుతున్నారు. పైగా దానికి ప్రజారోగ్య రంగంలో ఇదో విప్లవాత్మక కార్యక్రమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టుల రీ-టెండరింగ్ అన్నారు… ఇప్పుడు పథకాల రీ-లాంచ్ అంటున్నారు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.