Jagan and AB Venkateswara Raoమాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మార్చి 21న మీడియా సమావేశం నిర్వహించి పెగాసస్ సాఫ్ట్ వేర్ దుమారం పై వెంకటేశ్వరరావు తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటనే ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణమైంది.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని అసెంబ్లీ వేదికగా రచ్చ-రచ్చ చేశారు వైసీపీ నాయకులు. ఈ విషయాన్ని టీడీపీ పార్టీ ఖండించినా వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా భాద్యతలు నిర్వహించిన వెంకటేశ్వరరావు తన వంతు బాధ్యతగా ప్రజలకున్న అపోహలను తొలగిస్తానని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోళ్లలో టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అది ఒట్టి ఆరోపణ మాత్రమే అంటూ వైసీపీ దృష్టిలో పడ్డారు. తమ ప్రభుత్వం పై పరోక్ష విమర్శలు చేసిన వారికి పనిష్ మెంట్స్ ఉంటాయంటూ ఇప్పుడు వెంకటేశ్వరరావుకు వైసీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడటంపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం తప్పని., ఆలిండియా సర్వీస్ రూల్స్ 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశాలను నిర్వహించారని., నోటీసులు అందిన వారం రోజులలోపు వివరణ ఇవ్వలంటూ…., లేని పక్షంలో తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందంటూ ప్రధాన కార్యదర్శి నోటీసులో పేర్కొన్నారు.