YS-Jagan-Padayatra---Anantapurప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా కర్నూల్ జిల్లాలో బిజీగా ఉన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరై ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆయన వ్యూహం. అయితే దీనిలో భాగంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అతిపెద్ద సక్సెస్ అయిన పట్టిసీమ ప్రాజెక్ట్ పై ఎప్పటిలానే విమర్శలు గుప్పించారు.

“పట్టిసీమ ఎక్కడుంది? రాయలసీమ ఎక్కడుంది? ఆ ప్రాజెక్టు నుంచి రాయలసీమ సస్యశ్యామలం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా..? గోబెల్స్‌ ప్రచారంతో చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు” అని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఇదే ఆరోపణ జగన్ చాలా సార్లు చేసారు దానికి గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పింది.

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకే నీళ్లు వస్తాయి. అయితే కృష్ణా డెల్టాకు కృష్ణా నది నుండి వచ్చే వాటా నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలిస్తున్నాం అని గవర్నమెంట్ చెప్పింది. అదే ప్రకారం చేసింది కూడా. రాయలసీమకు గతంలో ఎప్పుడు లేని విధంగా నీరు అందింది పోతిరెడ్డి ద్వారా. ఇదే విషయాన్నీ చాలా సార్లు సాక్షి పేపర్ తన తెలంగాణ ఎడిషన్ లో ప్రచురించింది.

“పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తోడేస్తున్నారు” అనే టైటిల్ తో తెలంగాణ వారిని రెచ్చగొట్టారు. ఇంత చేసాక చూసాక కూడా జగన్ కి పట్టిసీమకు రాయలసీమకు సంబంధం ఏంటో అర్ధం కాకపోతే ఏమనుకోవాలి? జగన్ కు అసలు నీటిపారుదల మీద అవగాహనా లేదనుకోవాలా? జగన్ ది తెలియనితనమా? లేక అమాయకత్వమా?