YS Jagan Government- Trying to Stall Select Committee--జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ వామపక్షాలలో కూడా విభజన కనపడుతుంది. సిపిఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుండగా, మరో పార్టీ సీపీఎం ప్రభుత్వానికి కొంతమేర అనుకూల వైఖరినే కనబరుస్తుంది. సిపిఐ ప్రతిపక్షాలతో కలిసి అమరావతి రైతుల సమస్య, వివిధ చోట్ల భూసమీకరణ విషయాల పై పోరాడుతుంది.

అయితే ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారినట్టు అనిపిస్తుంది. “నారాయణ, రామకృష్ణలకు టీడీపీ నుంచి డబ్బులు అందుతున్నాయి….టిడిపి వారు రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతున్నారు,” అంటూ ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై తెలుగుదేశం వారు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు.

“వామపక్షాలను ఇప్పుడు డబ్బులు తీసుకున్నారని విమర్శిస్తున్నారు సరే. ఇవే పార్టీలు, ఇదే నాయకులు చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించే వారు. అప్పుడు మీరు వారికి డబ్బులు ఇచ్చే వారా? అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడకూడదు,” అంటూ టీడీపీ వారు చురకలు అంటిస్తున్నారు.

జనసేన బీజేపీతో చేతులు కలిపాకా, టీడీపీ ఒంటరి అవుతుందని అధికార పక్షం భావించింది. అయితే అనూహ్యంగా అమరావతి విషయంలో టీడీపీకి వామపక్షాల మద్దతు ఇవ్వడం కొంత కంటగింపుగా మారింది. చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ప్రభుత్వ వ్యతిరేక యాత్రలు కూడా చెయ్యడంతో ఇది మరింత ఎక్కువైంది.